10 July, 2026 | 10:18 AM

పెళ్లికెళ్లి తప్పతాగి దారితప్పాడు

01-12-2024 03:05 AM

దొంగనుకుని యూపీ గ్రామస్థుల బడితపూజ

లక్నో, నవంబర్ 30: పెళ్లికి వెళ్లి తప్పతాగిన వ్యక్తిని దొంగగా భావిం చి విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. దేవరియా జిల్లాలోని తా ర్కూల్వాలో బుధవారం జరిగిన వివాహానికి ఓ వ్యక్తి హాజరయ్యాడు.  రాత్రి జరిగిన ఊరేగింపులో పాల్గొని తప్పతాగాడు. మద్యం మైకంలో దారి తప్పిన అతడు గ్రామంలోని ఓ ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. అంతకుముందు రోజు రాత్రి ఆ ఏరియాలో దొంగలు పడటంతో మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని దొంగగా భావించి విద్యుత్ స్తంభానికి కట్టేసి స్థానికులు చితక్కొట్టారు.అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు అతడిని గ్రామంలోని పెళ్లికి వచ్చిన అతిథిగా తమ విచారణలో గుర్తించారు.