నాలుగేండ్లు ఆలస్యమైంది
బైడెన్ చేతిలో ఉన్న బుక్‌పై రైటర్ రషీద్ కామెంట్
న్యూఢిల్లీ, నవంబర్ 30: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ఆది నుంచి ఇజ్రాయెల్ పక్షాన నిలుస్తూ వచ్చింది. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ చేతిలో దర్శనమిచ్చిన పుస్తకం అందరిని ఆశ్చర్యప రిచింది. కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రషీద్ ఖలీ రాసిన ‘ద హండ్రెడ్ ఇయర్స్ వార్ ఆన్ పాలస్తీనా’ అనే పుస్తకాన్ని పట్టుకొని బ్లాక్‌ఫ్రైడే షాపింగ్ మాల్ వద్ద నిల్చున్నారు. కాగా ఈ బుక్‌ను ఆయన కొనుగోలు చేశారా? లేదా ఎవరైనా ఇచ్చారా అనే విషయమై స్పష్టత లేదు.
దీనిపై రచయిత ఖలీద్ స్పందిస్తూ ‘నాలుగు సంవత్సరాలు.. చాలా ఆలస్యం’ అని వ్యాఖ్యనించారు. గతేడాది అక్టోబర్ 7న హమాస్ దాడికి ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతిదాడులతో గాజాలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా ఫలితాన్నివ్వలేదు.






