calender_icon.png 9 January, 2026 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లారెడ్డి వాసికి ప్రతిష్ఠాత్మక పోలీసు సేవా పథకం

03-01-2026 10:03:10 PM

ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన సీఐ తోట లింగం

 ప్రతిష్టాత్మక పోలీసు సేవా పతకానికి ఎంపిక

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన సీఐ తోట లింగం ప్రతిష్టాత్మక పోలీసు సేవా పతకానికి ఎంపికయ్యాడు. ఈ మేరకు శనివారం వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం తోట లింగం అవినీతి నిరోధక శాఖ హైదరాబాద్ రేంజ్  విభాగంలో విధులు నిర్వర్తిస్తూ 2025లో పోలీసు విశిష్ట పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన నేపథ్యమిది.

2009 బ్యాచ్ ఎస్సైగా హైదరాబాద్లోని మీర్చౌక్ పోలీస్ స్టేషన్లో తోటలింగం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కంచన్బాగ్, తిరుమలగిరి పోలీస్ స్టేషన్లలో నిక్కచ్చిగా పనిచేస్తూ మంచిపేరు తెచ్చుకున్నారు. పదోన్నతుల్లో భాగంగా సీఐడీ సీఐగా టాస్క్ఫోర్స్లో పనిచేశారు. హైదరాబాద్ రేంజ్లోని అవినీతి నిరోధక శాఖలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా గత ఏడాది నుంచి పనిచేస్తూ ఉత్తమ సేవలకు గాను సేవా పతకానికి ఎంపికయ్యారు. పోలీస్ శాఖలో ఎలాంటి వివాదాల్లేకుండా క్లీన్గా విధులు నిర్వహిస్తు ఉత్తమ సేవా పతకానికి ఎంపికవ్వడంపై ఎల్లారెడ్డి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.