09-01-2026 11:36:33 AM
ఇంటి సమీపంలోకి దూసుకొచ్చిన టిప్పర్
నాగేపల్లి లో టిప్పర్ ఢీకొని యువకునికి తీవ్ర గాయాలు
రామగిరి,(విజయక్రాంతి) ప్రమాద కారంగా జాతీయ రహదారి పనులు(National highway works) కొనసాగుతున్నాయి. మండలంలోని నవపేట నుంచి ప్రారంభించిన జాతీయ రహదారికి ఓసిపి మట్టిని టిప్పర్లలో తరలిస్తున్నారు. దీంతో టిప్పర్ డ్రైవర్లు ఓసిపి నుంచి నవ పేట వరకు మట్టిని తరలిస్తున్న డ్రైవర్లు ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులకు రక్షణ లేకుండా పోతుంది. మండలంలోని నాగేపల్లి-ముత్తారం ప్రధాన రాహదారి నవాబ్ పేట సమీపంలో గురువారం రాత్రి మెగా కంపెనీకి చెందిన మట్టి తరలిస్తున్న టిప్పర్ ఢీకొని యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు 108 సిబ్బందికి సమాచారం అందించడంతో యువకుడ్ని ఆసుపత్రికి తరలించారు. మట్టి తరలిస్తున్న ట్రిప్పరు ఏకంగా ఇంటి సమీపంలో దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది.