calender_icon.png 8 January, 2026 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల నిర్వహణ సమన్వయంతోనే సాధ్యమైంది

03-01-2026 10:00:54 PM

– జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): అధికారుల సమన్వయంతోనే నాగర్‌ కర్నూల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించగాలిగామని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. మూడు దశల్లో నిర్వహించిన ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. అందుకు అధికారులంతా పటిష్టంగా పనిచేశారని కొనియాడారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన విజయోత్సవ సభలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఎన్నికల సిబ్బందికి సమర్థవంతమైన శిక్షణ అందించడంతో సమస్యలు తలెత్తలేదన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న మున్సిపల్ ఎన్నికలను కూడా విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.