16 July, 2026 | 10:40 PM

మరో ఆరు నెలలు ఎమ్మెల్సీగా సేవ చేస్తా

06-06-2024 01:52 AM

ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి

జగిత్యాల, జూన్ 5 (విజయక్రాంతి): దేవుడి పేరుతో బీజేపీ ఓట్లడిగి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిందని, దేవుడి ముందు తాను చిన్నవాడినని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఇందిరాభవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పనిగట్టుకుని బీజేపీకి ఓట్లు బదిలీ చేసిందని ఆరోపించారు. మరో ఆరు నెలల వరకు శాసన మండలి సభ్యుడిగా సేవా చేస్తానన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ మత విదేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకున్నదన్నారు. యూపీలో ఇండియా కూట మే అత్యధిక స్థానాలు గెలుచుకున్నదన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్స న్ అడువాల జ్యోతి, టీపీసీసీ కార్యనిరాహక కార్యదరి బండ శంకర్, నాయకులు సిరాజుద్దీన్ మన్సూర్, కల్లెపల్లి దుర్గయ్య పాల్గొన్నారు.