యూపీలో ఇండియా జోరు
05-06-2024 03:07 AM
ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి అద్భుతంగా పుంజుకొన్నది. 80 స్థానాలు గల యూపీలో ఏ పార్టీ ఆధిక్యం కనబరిస్తే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందనే నానుడి. అం దుకే ఇక్కడ అధిక సీట్లు గెలుచుకునేందుకు ఎన్‌డీఏ, ఇండియా కూట ములు సర్వశక్తులు ఒడ్డాయి. ఈ ఎన్నిక ల్లో బీజేపీ 36 స్థానాలకే పరిమితమవ్వగా.. ఎస్పీ అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 37 సీట్లు దక్కించుకుంది. ఇక, కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయం సాధించింది. ఈ రెండూ ఇండియా కూటమిలో ఉన్నందున మొత్తం 43 స్థానాలు దక్కాయి. ఇక, ఆర్‌ఎల్‌డీ 2 స్థానాల్లో, ఏడీఏఎల్ 1 స్థానం, ఏఎస్‌పీకేఆర్ 1 స్థానంలో గెలుపొందాయి. 2019 ఎన్నికల్లో 62 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ గ్రాఫ్ పడిపోయింది.






