13-11-2025 12:00:00 AM
అన్నపురెడ్డిపల్లి, నవంబర్ 12 (విజయక్రాంతి); ఎక్కడ నుండో బ్రతుకు దెరువు కోసం వచ్చి ఇటకుల బట్టీలో వుంటున్న చత్తిస్ గడ్ ఆదివాసి ప్రజలు ఆరోగ్యం కోసం యర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ప్రియాంక బుధవారం ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వారినీ పరీక్షించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. మండల పరిధిలోని గుంపెన హెచ్ కాలని సమీపంలో ఇటుకల బట్టిలో పని చేస్తున్న పలువురు మహిళలుకు పలు పరీక్షలు చేశారు.
గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేది వారికి అవగాహన కల్పించారు. చలి తీవ్రత ఎక్కువగా వుండటంతో చిన్న పిల్లలను చలి నుండి ఎలా కాపాడుకోవాలనీ తల్లితండ్రులకు సూచనలు చేశారు. మలేరియా,డెంగ్యూ వంటి విష జ్వరాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించి దోమల బెడద లేకుండా దోమ తెరలు ఉపయోగించుకోవాలన్నారు.ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే ఆరోగ్య కేంద్రానికి వచ్చి తగిన పరీక్షలు చేయించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ప్రకాష్ రావు, హెల్త్ అసిస్టెంట్ రామదాసు, రాణి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.