13-11-2025 12:00:00 AM
అభినందించిన జిల్లా కలెక్టర్
కొత్తపల్లి, నవంబరు 12 (విజయ క్రాంతి): నగరంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలకు చెందిన 10 వ తరగతి విద్యార్థిని తాడూరి హరిణి రెడ్డి జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయింది. ఇటీవల తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెల్లాపూర్లో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అండర్-18 బాల బాలికల ఆర్చరీ ఛాంపియ న్ షిప్ పోటీలలో విద్యార్థిని అత్యుత్తమ ప్రతిభను కనబరిచి కాంస్య పతకం సాధించి ఈ నెల 25 నుండి 30 వరకు అరుణాచల్ ప్రదే శ్ రాష్ట్రం ఈటానగర్ లో జరగబోయే జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల డైరెకర్ హన్మంత రావు తెలిపారు.
విద్యార్థినిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన కార్యాలయంలో కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సంధర్భంగా పాఠశాల చైర్మన్ డాక్టర్ ఇ. ప్రసాదరావు, డైరెక్టర్స్ ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, వి.యు. యం. ప్రసాద్, వినోద్ రావు, హన్మంతరావు, ప్రధానోపాధ్యాయుడు గోపికృష్ణ, సమన్వయ కర్త రబీంద్ర పాత్రో, వ్యాయామ ఉపాధ్యాయులు యస్.రాజు, రాజబాపు, శ్రీనాథ్, గోలి సుధాకర్ లుఅభినందించారు.