02-08-2024 12:25:11 PM
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్,ఐఎస్ఎస్ నుంచి భూమికి రావడానికి ఆలస్యం అవుతుండటంతో భారతి సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ కు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మైక్రోగ్రావిటీకి ఎక్కువ కాలం గురికావడంతో ఆమె వేగంగా ఎముకల సాంద్రత కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది. దీర్ఘకాలం స్పేస్లో గడపటం వల్ల భూమిపైకి తిరిగొచ్చాక ఇతర అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.