28 June, 2026 | 3:08 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

పసుమాములలో హైడ్రా కూల్చివేతలు

13-03-2026 12:36 PM

15 కోట్ల విలువైన ప్లాట్లు, రోడ్డు కాపాడిన హైడ్రా అధికారులు 

హర్షం వ్యక్తం చేసిన కాలనీ అసోసియేషన్ సభ్యులు

అబ్దుల్లాపూర్‌మెట్: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) నాగోల్ సర్కిల్, పెద్దఅంబర్ పేట్ 52 డివిజన్ పరిధి పసుమాములలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు  కూల్చివేశారు. పసుమాముల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 454 గతంలో జీ పీ లేఅవుట్ చేశారు. ఇందులో కొంతమంది ప్లాట్లను విక్రయించగా ఈ లేఔటుకు అనుకొని ఉన్న భూ యజమాని కలింగారావు దాదాపుగా జీపీ లేఔట్ లో మన ఫ్లాట్లను, రోడ్డున కబ్జా చేసి అక్కడ చుట్టూ ముట్టు ఈ కాస్ట్ వాల్ గోడలు నిర్మించారు.

ఇది సవాలు చేస్తూ శ్రీకృష్ణ కాలనీ అసోసియేషన్ సభ్యులు హైడ్రా(Hydra Demolitions) కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అసోసియేషన్ చేసిన ఫిర్యాదులను పూర్తిస్థాయిలో విచారణ చేసి ప్లాట్లు, రోడ్డు కబ్జా జరిగిన వాస్తవమే తెలిసింది. దీంతో హైడ్రా ఇన్ సెక్టర్ సైదులు ఆధ్వర్యంలో తన సిబ్బంది, హయత్ నగర్ పోలీస్(Hayathnagar Police) ప్రొటెక్షన్ తో అక్రమ నిర్మాణాలను శుక్రవారం కూల్చివేశారు. కబ్జాదారుల నుంచి రూ.15 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడి బాధితులకు అప్పగించారు.

దీంతో అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ... కబ్జాదారుల నుంచి మా ప్లాట్లను  కాపాడి తమకు అప్ప చెప్పినందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు, హైడ్రా సిబ్బందికి  కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ అసోసియేషన్ అధ్యక్షులు పండల ఆంజనేయులు గౌడ్, ఉపాధ్యక్షులు మధుసూదన రావు, కార్యదర్శి నాగేశ్వరరావు, సభ్యులు ఉదయ్, సాయి, నరసింహ, రాజు, చారి, మధుసూదనారెడ్డి, గూడెపు రాజు తదితరులు ఉన్నారు.