13 March, 2026 | 2:03 PM

నేను వాళ్లను అంతం చేస్తున్నా: ట్రంప్

13-03-2026 11:38 AM

మతిచెడిన నేతలకు ఏం జరుగుతుందో మీరే చూస్తారు: ట్రంప్ వార్నింగ్

మరోసారి ఇరాన్‌ను హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు తారాస్థాయికి చేరుకున్నాయి. యుద్ధం ఇప్పటితో ముగిసేలా అనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ఇరాన్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. మతిచెడిన నేతలకు ఇవాళ ఏం జరుగుతుందో మీరే చేస్తారని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ నౌకాదళం ఇప్పటికే కనుమరుగయ్యిందని ట్రంప్(Donald Trump) వెల్లడించారు. ఇరాన్ వైమానికదళం కూడా ఇక ఉండదని సూచించారు.

ఇరాన్ క్షిపణులు(Iranian missiles), డ్రోన్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయని పేర్కొన్నారు. ఇరాన్ నాయకులు భూమి పైనుంచి తడిచిపెట్టుకుపోయారని తెలిపారు. 47 ఏళ్లుగా ఇరాన్ అమాయకులను పొట్టనపెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా తాను వారిని అంతం చేస్తున్నానని స్పష్టం చేశారు. తనకు ఈ అవకాశం రావడం ఎంతో గొప్ప గౌరవమని ట్రంప్ తెలిపారు.