calender_icon.png 2 November, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి పండుగలోనూ ఆరోగ్య సూత్రం

02-11-2025 12:13:46 AM

ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

ఉప్పల్, నవంబర్ 1 (విజయక్రాంతి) : ప్రతి పండుగలను ఏదో ఒక అర్యోగం సూ త్రం ఉంటుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఆధ్వర్యంలో  జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళ వన సంరాధన కార్యక్రమానికి  ఆయన  ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పండుగలు  ఆరోగ్యం రహస్యాలకు నిలయమన్నారు. 

కార్తీకమాసం అంటేనే  కార్తీక దీపాలు వనభోజనాలే గుర్తు వస్తాయని కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనాలు చేయడం సాంప్రదాయంలో వస్తుందని మంత్రి పేర్కొన్నారు. మంత్రి రాకతో ఘన స్వాగతం  పలికిన కాంగ్రెస్ నాయకులు వనభోజ మహోత్సవానికి మం త్రి శ్రీధర్ బాబు రావడంతో మల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు కప్పర సాయి ఎస్వి కిట్టు ఘన స్వాగతం పలికారు.  మంత్రిని శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు  కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.