02-11-2025 12:14:32 AM
15 మంది విద్యార్థులకు అస్వస్థత
గద్వాల జిల్లా ఎర్రవల్లిలో ఘటన
గద్వాల, నవంబర్ 1 (విజయక్రాంతి): గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలోని అయిజకు చెందిన ఎస్సీ గురుకుల, జూనియర్ కళాశాలలో శనివారం ఉదయం టిఫిన్ చేసిన తర్వాత 15 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. ఇందులో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురికాగా హాస్టల్ సిబ్బంది వారిని గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న శ్రీను, అఖిల్, రెండో ఏడాది చదు వుతున్న భరత్ చికిత్స పొందుతున్నారు.
ధర్మవరం విద్యార్థులకు పరామర్శ
ఇటిక్యాల మండలం ధర్మవరం బీసీ బాలుర సంక్షేమ వసతి గృహంలో శుక్రవారం అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించినట్లు కలెక్టర్ బి. ఎం సంతోష్ తెలిపారు. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను శనివారం కలెక్టర్ సంతోష్, గద్వాల ఎమ్మె ల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు వేర్వేరుగా పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్య అధికారులను వారు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకోవడం జరుగుతుందని వారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. చికిత్స అనంతరం 32 మంది విద్యార్థులు బాగుండడంతో ఉదయం వారిని డిశ్చార్జి చేసినట్లు పేర్కొన్నారు. ఫుడ్ పాయిజన్‌కు బాయిలర్ ఎగ్ కూడా కారణమని ఆరోపణలు వస్తుండటంతో శాంపిల్స్ ఉంటే ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు పంపించి పరీక్షలు చేయిస్తామని కలెక్టర్ తెలిపారు.