26 March, 2026 | 2:07 AM

పౌష్టికాహారంతో ఆరోగ్యం

26-03-2026 12:23 AM

ములకలపల్లి, మార్చి 25 (విజయక్రాంతి): గర్భిణీ మహిళలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని కమలాపురం సర్పంచి వగ్గేల రాదా అన్నారు. మండల పరిధిలోని కమలాపురం గ్రామ లో బుధవారం అంగన్వాడి సెంటర్లో గర్భిణీ స్త్రీలకు నిర్వహించిన సీమంతం వేడుకలలో సర్పంచ్ ఒగ్గేల రాధ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణి స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పాలు, పండ్లు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని గర్భిణీ స్త్రీలకు సూచించారు. అనంతరం చిన్న పిల్లల పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.

కమాలపురం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని పాఠశాలలో సమస్యలను ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కాస్తానని తెలిపారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం మోను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి దోమల అరుణ్ కుమార్, అంగన్వాడీ కార్యకర్తలు కరపటి పార్వతీ, ఆశా ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.