12 July, 2026 | 6:04 PM

Breaking News

ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్.. లిక్కర్ కేసు విచారణ వాయిదా

06-04-2026 04:01 PM

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసు విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 13కు వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు జడ్జి(Delhi High Court Judge) ప్రకటించారు. మద్యం విధాన కేసులో ఆప్ కన్వీనర్ ఇతర నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన సీబీఐ పిటిషన్ విచారణ నుంచి జస్టిస్ స్వర్ణకాంత శర్మను తప్పించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సోమవారం ఢిల్లీ హైకోర్టులో స్వయంగా హాజరయ్యారు.

న్యాయమూర్తి శర్మ, తాను విచారణ నుండి వైదొలగాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన దరఖాస్తును నమోదు చేసుకుని, ఏప్రిల్ 13న విచారణకు జాబితా చేశారు. సీబీఐ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, న్యాయస్థానం నాటకాలకు వేదిక కాదని, ఈ కేసులో కేజ్రీవాల్ స్వయంగా హాజరు కావాలనుకుంటే తన న్యాయవాదిని తొలగించుకోవాలని వాదించారు. హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు వేస్తున్నారని పేర్కొన్నారు. ఇంకా ఎంతమంది ఇదే విషయం కోరుతున్నారో చెప్పాలని జస్టిస్ స్వర్ణకాంత  తెలిపారు. పిటిషన్లు వేస్తే తదుపరి విచారణలోపు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.