7 April, 2026 | 3:24 AM

బీరుట్ విలవిల

07-04-2026 01:34 AM

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 36 మంది మృతి

బీరుట్, ఏప్రిల్ 6: లెబనాన్‌పై సోమవారం ఇజ్రాయెల్ జరిపిన భీకర వైమానిక దాడుల్లో భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం. ఈ ఒక్కరోజే జరిగిన దాడుల్లో కనీ సం 36 మంది మరణించారు. 210 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు ఉండటం అత్యంత విషాదం. మార్చి నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లెబనాన్‌వ్యాప్తంగా 1,497 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,639 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.