12 June, 2026 | 2:06 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ

12-06-2026 01:06 PM

న్యూఢిల్లీ: మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై(Meenakshi Natarajan petition) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మీనాక్షి నటరాజన్ తరఫున అభిషేక్ మను సింఘ్వీ(Abhishek Manu Singhvi) వాదనలు వినిపించారు. నామినేషన్ తిరస్కరణపై తాము నేరుగా జోక్యం చేసుకోలేమని జడ్జి వెల్లడించారు. నామినేషన్ తిరస్కరిస్తే ఈసీని ఆశ్రయించవచ్చని సర్వోన్నత న్యాయం స్థానం స్పష్టం చేసింది. గతంలో జోక్యం చేసుకున్న తీర్పులు ఉంటే చూపించాలని సుప్రీంకోర్టు తెలిపింది.

తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ ఇలా అన్నారు. తాను ఎలాంటి సమాచారం దాచలేదని తెలిపారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసు లేదన్నారు. తాను నేరపూరిత చర్యలకు పాల్పడలేదని వివరించారు. అడిగిన సమాచారం ఇచ్చినా నామినేషన్ తిరస్కరించారని వాపోయారు. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతోందని భావిస్తున్నట్లు మీనాక్షి పేర్కొన్నారు.

రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు అశోక్ సింగ్ మాట్లాడుతూ, "...నిన్న సుప్రీంకోర్టు ఈ విషయాన్ని విచారించకుండా, ఈరోజు తేదీని ఇచ్చింది. ఈ విధంగా దరఖాస్తులను తిరస్కరించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం" అన్నారు.