10-07-2024 03:15:59 PM
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ వాయిదా
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ నెల 23 వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంయమనం పాటించండని హైకోర్టు సూచించింది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్దాంతం వచేయొద్దని ఆదేశించింది. జడ్జీలు, వారి కుటుంబసభ్యుల పేర్లు బహిర్గతం చేయొద్దని తెలిపింది. ఫోన్ నంబర్లు, ఫొటోలు బహిర్గతం చేయొద్దని పేర్కొంది. ఈ నెల 23న కౌంటర్ దాఖలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.