ఉద్యోగ విరమణ పొందనున్న అధికారికి ఆత్మీయ సన్మానం
27-08-2026 09:43 PM
రామగిరి,(విజయ క్రాంతి): గురువారం అడ్రియాల లాంగ్ వాల్ గని నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందనున్న అడ్రియాల లాంగ్ వాల్ గని ప్రాజెక్ట్ ఇంజినీర్ టి. రఘురామ్ ను డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్.వి.సూర్య నారాయణ సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టి.రఘురామ్ సింగరేణి సంస్థలో వివిధ ఏరియాలలో, వివిధ గనులు, విభాగాలలో, వివిధ హోదాలలో విధేయతతో, అంకితభావంతో అందించిన సేవలు అందరికీ ఆదర్శమన్నారు.ఉద్యోగ విరమణ అనంతరం వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు, రామగుండం ఆర్ జి -3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.






