calender_icon.png 17 February, 2026 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అష్టదిగ్బంధంలో తొర్రూరు, జనగామ

17-02-2026 12:12:26 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడ్డ తొర్రూరు, జనగామ మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం అటు అధికార కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు హోరాహోరీగా తలపడడంతో పాటు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడంతో శాంతి భద్రతల పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు నిర్ణయించారు.

ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో(Thorrur Municipality) జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, జనగామ లో డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఇరుచోట్ల వెయ్యి మందికి పైగా పోలీసుల బందోబస్తుతో ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం పోలీసులతో ఆయా పట్టణాల్లో కవాతు నిర్వహించి, తొర్రూరు, జనగామ పట్టణాలను పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు చేపట్టారు. 11:30 ప్రాంతంలో ఐయా మున్సిపాలిటీల్లో నిర్వహించే ఎన్నికలకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు భారీ బందోబస్తు మధ్య మున్సిపాలిటీ కార్యాలయాలకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో అధికారులు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఇరు మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ కు సమాన ఓట్లు రావడంతో ఉత్కంఠ నెలకొంది.