5 August, 2026 | 2:28 PM

హైదరాబాద్‌లో భారీ వర్షం

21-06-2024 02:34 PM

హైదరాబాద్: నగరంలో భారీ వర్షం కురిసింది.  దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాతబస్తీ, రాయదుర్గం, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొత్తపేట, సరూర్‌నగర్, చంపాపేట్, సైదాబాద్, మాదన్నపేట్, మలక్ పేట్, చందర్‌ఘాట్, ఎల్‌బీ నగర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. శనివారం భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.  గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచించింది.