5 August, 2026 | 3:31 PM

బొగ్గు గనుల వేలం ప్రక్రియ ప్రారంభం.. పాల్గొన్న భట్టి విక్రమార్క

21-06-2024 01:51 PM

హైదరాబాద్: బొగ్గు గనుల వేలం ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. పదో విడత బొగ్గు గనుల వేలం ప్రక్రియ కేంద్ర సహాయమంత్రి సతీశ్ చంద్ర దూబే, కార్యదర్శి అమృత్ లాల్ పాల్గొన్నారు. వేలం నిర్వహణలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... సింగరేణి తెలంగాణ కొంగుబంగారం అన్నారు. సింగరేణి బొగ్గుతోనే ఇక్కడి విద్యుత్ ఉత్పత్తి సంస్థలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. సింగరేణికి  కొత్త గనులను కేటాయించాలన్నారు. ఎన్ఎండీఆర్ యాక్ట్ కు ముందు బొగ్గు గనులపై సింగరేణి పూర్తి అధికారం ఉండేదని చెప్పారు. 2015లో ఎన్ఎండీఆర్ సవరణ ప్రకారం సింగరేణి తన హక్కులను కోల్పోయిందని వ్యాఖ్యానించారు. బొగ్గు గనుల వేలాన్ని రాష్ట్రం ఉపయోగించుకోవాలని పాల్గొన్నానని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.