17 April, 2026 | 8:58 AM

మానుకోటలో భారీ వర్షం

28-05-2025 12:08 PM

855.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో(Mahabubabad District) మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లో ఒక గార్ల మినహా మిగిలిన అన్ని మండలాల్లో మోస్తరు నుంచి బాడీ వర్షం కురవగా, జిల్లావ్యాప్తంగా 855.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. నెల్లికుదురు లో 88.2, కేసముద్రంలో 84.8, నరసింహుల పేటలో 84.2, కొత్తగూడలో 80.2, మహబూబాబాద్ లో 78.6, చిన్న గూడూరులో 70.2, బయ్యారంలో 64.4, దంతాలపల్లి లో 63.4 , గూడూరులో 54.0,  తొర్రూర్ లో 32.6, పెద్ద వంగరలో 28.4, గంగారంలో 36.4, కురవిలో 40.8, డోర్నకల్ లో 22.2, మరిపెడలో 22.4 , గార్లలో 4.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. భారీ వర్షానికి పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.