calender_icon.png 29 May, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్టీఆర్ తోనే రాజకీయ చైతన్యం

28-05-2025 12:10:48 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్(Nandamuri Taraka Rama Rao) రాజకీయ రంగ ప్రవేశం తోనే రాజకీయ చైతన్యం వచ్చిందని, బడుగు బలహీన వర్గాలకు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం స్వర్గీయ రామారావు కల్పించి, ప్రజల్లో చిరస్మరణీయుడిగా గుర్తింపు పొందారని కేసముద్రం గ్రామ మాజీ సర్పంచ్ సట్ల నరసయ్య అన్నారు. ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం లో ఎన్టీఆర్ శిలా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు పోలేపల్లి చెన్నారెడ్డి, సారంగం, కేదారి, సుమన్ తదితరులు పాల్గొన్నారు.