తల్లిపాలే బిడ్డకు పౌష్టిక ఆహారం
05-08-2026 10:50 AM
ఐసిడిఎస్ సూపర్వైజర్ స్వప్న
సిద్దిపేట, (విజయక్రాంతి): తల్లిపాలే పిల్లలకు పౌష్టికాహారమని ఐసిడిఎస్ సూపర్వైజర్ స్వప్న సూచించారు. సిద్దిపేటలోని వడ్డెర కాలనీ అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని బాలింతలు, గర్భవతులు పొందాలని తెలిపారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలు అంగన్వాడి కేంద్రంలో చేర్చాలని దానివల్ల పిల్లలకు అవసరమైన పౌష్టికాహారం అందుతుందన్నారు. వయసుకు సరిపడా ఎత్తు, బరువు కలిగి ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ వినోద గర్భవతులు భాగింతలు పాల్గొన్నారు.






