calender_icon.png 12 August, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

5 రోజులు జోరువానలు

12-08-2025 12:42:58 AM

రేపు అతిభారీ వర్షాలు

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో 5 రోజుల పాటు జోరుగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫా బాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, భూ పాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షా లుంటాయని చెప్పింది. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ మేరకు ఆయా జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. బుధవారం ఆదిలాబాద్, హనుమకొండ, హైదరాబాద్, జనగామ, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారా యణపేట, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గురువారం భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పలుచోట్ల అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. గురువారం ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, ము లుగు, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.