పొలం పనులు పూర్తికాకముందే తొందర పెడుతున్న తొలకరి జల్లులు
బోథ్,(విజయక్రాంతి): బోథ్ సోనాల మండలాలలో సోమవారం కురిసిన భారీ వర్షం రైతులను తొందర పెడుతున్నాయి. పొలం పనులు పూర్తిగా పెట్టుబడుల కోసం వెంపల్రాడుతున్న రైతన్నకు తొలకరి జల్లు తొందర పెట్టినట్టు అయిందని రైతులు వాపోతున్నారు. నిన్నటి వరకు జొన్న మొక్కజొన్న పంట విక్రయాలలో బిజీగా గడిపిన రైతులు పొలాల వైపు కన్నెత్తి చూడ లేదు.
దీంతో సేద్యానికి భూములను సిద్ధం చేయలేకపోయామని రైతులంటున్నారు. మరోవైపు పంట పెట్టుబడుల కోసం వెతుకులాటలో ఉన్న ఈ సమయంలో భారీ వర్షం కురవడంతో రైతులు మంగళవారం నుండి పొలాల వైపు దృష్టి సారించారు. సేద్యానికి సిద్ధం చేసుకున్న కొంతమంది రైతులు విత్తనాలు నాటుతుండగా, మరి కొంతమంది రైతులు సాగుకు సిద్ధం చేసేందుకు కూలీలను వెంటేసుకుని వెళ్తున్నారు. తురకరిజల్లు భారీగా కురవడంతో రైతులు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు






