calender_icon.png 12 August, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో 4 నెలల్లో సోలార్

12-08-2025 12:44:04 AM

  1. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ పనులు పూర్తి

రైతులను బలోపేతం చేసే దిశగా పట్టిష్ట చర్యలు

మంథనిలో రూ.2 కోట్ల 90 లక్షలతో పీఎం కుసుమ్,సోలార్ పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపనలో మంత్రి శ్రీధర్ బాబు

మంథని, ఆగస్టు11 (విజయ క్రాంతి) మంథని మండలంలో లో 4 నెలల్లో సోలా ర్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ పనులు పూర్తి చే సి,రైతులను బలోపేతం చేసే దిశగా సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపట్టామని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.

సోమవారం మంథని ప్రాంతంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, కరీంనగర్ డిసిసిబి చై ర్మన్ రవీందర్ రావు లతో కలిసి  మంథని మండలం చిల్లపల్లి గ్రామంలో తెలంగాణ రా ష్ట్ర వేరు హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆ ధ్వర్యంలో రూ. 7 కోట్ల తో 5 ఎకరాల స్థలం లో నిర్మిస్తున్న రెండు గోదాములకు, గుంజపడుగు గ్రామంలో రూ. 2 కోట్ల 90 లక్షల తో పీఎం కుసుమ్ ద్వారా ప్యాక్స్ ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్ మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథని ఆధ్వర్యం లో గుంజపడుగు శివారులో పి.ఎం కుసుమ్ క్రింద రూ. 3.5 కోట్ల రూపాయలతో 1 మెగా వాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పా టు శంకుస్థాపన చేసుకున్నామని,రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పాలసీలో భా గంగా మన పెద్దపల్లి జిల్లాలో నంది మేడారం, కాల్వ శ్రీరాంపూర్, అప్పన్న పేట, మంథని ప్రాంతాలలో 1 మెగా వాట్ చోప్పు న ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, 4 నెలల కాలంలో ఈ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం,

గ్రిడ్ కనెక్షన్ పనులు పూర్తి చేయాలన్నారు.ఆర్జీ- 1 జీఎం లలిత్ కుమార్, గ్రంథాలయ సంస్థ చై ర్మన్ అన్నయ గౌడ్, మంథని మార్కెటింగ్ క మిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ఆర్.డి.ఓ. సురేష్, సహకార సంఘ అధ్యక్షులు కొత్త శ్రీ నివాస్, తహసిల్దార్ కుమార్ స్వామి, ఎంపిడిఓ, మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, నాయకులు శశిభూషణ్ కాచే, వనం రామచంద్రరావు, ముస్కుల సురేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొమ్ము పద్మ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.