26 March, 2026 | 3:29 PM

Breaking News

పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిరంతరం సరఫరా.. కొరత లేదన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌   •   మార్కాపురం బస్సు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన ఇద్దరు మృతి   •   మ‌ర్యాద ఇవ్వ‌డం లేదని అత్తమామలపై కక్ష.. ఏడేళ్ల చిన్నారిని చంపిన బావ   •   గొల్లపల్లి కొలనూరులో ద్వారక యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక   •   గ్యాస్ కోసం రోడ్డెక్కిన క్యూ లైన్   •   ఆడపిల్లకు అన్యాయం... అడిగితే అక్రమ కేసులా..?   •   తాసిల్దార్ కార్యాలయం ముందు పడిగాపులు   •   పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యత్వాల నమోదు ప్రారంభం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •   ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, పోలీస్ ఎస్‌హెచ్‌వోను నియమించాలి   •  

మూడు రోజలు భారీ వర్షాలు

23-09-2024 01:34 AM
  1. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
  2. నేడు అల్పపీనడం ఏర్పడే అవకాశం

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ఇప్పటి వరకు పశ్చిమ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడగా.. తాజాగా మయన్మార్ దక్షిణ తీరంలో మరొకటి ఏర్పడినట్లు ఆదివారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండు ఆవర్తనాల కారణంగా రాబోయే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆవర్తనం ప్రభావం వల్ల సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. వర్ష సూచన ఉన్న  జిల్లాలకు ఆదివారం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.