26 March, 2026 | 1:47 PM

Breaking News

బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •  

జెండా మారితే బాగోతం బయటేస్తం

23-09-2024 01:33 AM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా ఆ పార్టీ నేతలు సరికొత్త ఉపా యం ఆలోచించారు. ఎవరైనా పార్టీ వీడితే గత పదేళ్లలో వారు చేసిన బాగోతాలు బయట పెతామంటూ బెదిరింపులకు తెరతీశారు. తమ పాలనలో అక్రమాలకు పాల్పడినా తమ నాయకులేనని చూసిచూడనట్టు వ్యవహరించామనీ, ఇప్పడు పార్టీని వీడితే గతంలో దోచుకున్న సొమ్మును కక్కిస్తామని హెచ్చరిస్తున్నారు. నమ్మిన పార్టీకి ద్రోహం చేయకుండా అధినేత ఆదేశానుసారంగా నడుచుకుంటే తప్పులు దాచిపెడుతామని చెప్తుండటం గమనార్హం. జెండా మారితే గతంలో చేసిన అవినీతి బాగోతాలను బట్టబయలు చేస్తామని బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు ప్రతిపక్ష పార్టీ సీనియర్లు. దీంతో ఒక పక్క అధికారం పక్షం బెదిరింపులు, మరో వైపు సొంత పార్టీ బ్లాక్‌మెయిల్‌తో ముందుకు వెళ్లలేక, ఉన్నదాంట్లో ఇమిడలేక కొంత మంది ఎమ్మెల్యేలు ఫామ్‌హౌస్‌లకే పరిమితమవుతున్నారు. ఉన్న వ్యాపారాలు, కాంట్రాక్టర్లను కాపాడుకునేదెట్లా? అంటూ లోలోన మథనపడుతున్నారు.