23-09-2024 01:37:29 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ఈ నెల 24న ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, టీచర్లు, కార్మికులు మరియు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలోనే ఎమ్మెల్సీ కోదండరాం సన్మాన కార్యక్రమం కూడా ఉంటుందన్నారు.