12 May, 2026 | 11:15 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

మూడు రోజులు గట్టి వానలు!

22-06-2024 12:05 AM

వాతావరణ శాఖ వెల్లడి

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): రానున్న మూడు రోజులు భారీ ఉరుముల, మెరుపులతో కూడి న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురిసే అవకా శం ఉందని తెలిపింది.ఆదిలాబాద్, కుమ్రం బీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆ సమయంలో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు చెప్పింది.

ఆదివారం తేలికపాటి నుం చి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ  కురుస్తాయంది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరా బాద్, మేడ్చెల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూ బ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక సోమవారం సిద్దిపేట, యాదాద్రి, భవనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్  జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది.