30 July, 2026 | 9:04 AM

నేడు, రేపు భారీ వర్షాలు

25-08-2024 01:48 AM

రెండు రోజులు ఎల్లో అలర్ట్ జారీ 

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతా వరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు వర్ష సూచన ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం ఉరుములు మెరుపులతో భారీ వానలు పడుతాయని వెల్లడించింది. సోమవారం ఓ మోస్తరు వర్షాలు పడు తాయని అంచనా వేసింది. వర్ష సూచన ఉన్న జిల్లాల్లో ఈదురుగాలులు 40 కిలోమీటర్ల వేగంతో వీస్తా యని చెప్పింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మ ల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,  కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, వికా రాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.