కోర్సు మార్పు ప్రక్రియ పూర్తి
టీజీఎప్‌సెట్ కన్వీనర్
హైదరాబాద్, ఆగస్టు 24 (విజయ క్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీలో భాగంగా వెబ్ ఆధారిత అంతర్గత కోర్సుల మార్పు ప్రక్రియ పూర్తయిందని టీజీఎప్‌సెట్ కన్వీనర్ తెలిపారు. చివరి విడుత కౌన్సెలింగ్‌లో 99,006 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజర య్యారని పేర్కొన్నారు. అన్ని కాలేజీల్లో కలిపి 11,836 సీట్లు అంతర్గత కోర్సుల మార్పునకు అవకాశం ఉండ గా, వీటి కోసం 10,300 మంది విద్యార్థులు ఆప్షన్స్ పెట్టుకున్నట్టు స్పష్టంచేశారు.
మొత్తం 27,935 ఆప్షన్స్ రాగా, వీటిలో 5,579 సీట్లు అలాట్ చేశామని తెలిపారు. మొత్తం 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో 86,943 సీట్లు అందుబాటులో ఉండగా, చివరి విడుత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత 75,107 భర్తీ అయినట్టు పేర్కొన్నారు. ఇంకా 11,836 సీట్లు ఖాళీగా ఉండగా, భర్తీ శాతం 86.4 ఉందని వెల్లడించారు. చివరి విడుత కౌన్సెలింగ్ సీట్లు అలాట్ విద్యార్థులు షెడ్యూల్ ప్రకారం ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. కాలేజీలో అంతర్గత కోర్సు మార్పు ప్రక్రియలో బ్రాంచ్ మారిన విద్యార్థులు దానికి సంబంధించిన అలాట్‌మెంట్ ఆర్డర్‌ను మళ్లీ డౌన్‌లోడ్ చేసుకుని, ఆదివారంలోపు ఆయా కోర్సుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు.






