23 August, 2026 | 1:59 PM

శంషాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

23-08-2026 01:11 PM

రంగారెడ్డి ఆగస్టు23(విజయక్రాంతి): శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శంషాబాద్ వద్ద హైదరాబాద్- బెంగళూరు హైవేపై కంటైనర్ బోల్తా పడింది. బెంగళూరు హైవేపై కంటైనర్ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయి 3 గంటలుగా వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ట్రాఫిక్ జామ్ లోనే ఎంపీ డీకే అరుణ కాన్వాయ్ కూడా చిక్కుకుంది. ట్రాఫిక్ జామ్ తో.. ట్రాఫిక్ ఘటన స్థలానికి చేరుకోని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలంలో పోలీసులు క్రేన్ సయంతో కంటైనర్ ను తొలగించే చర్యలు చేపట్టారు.