5 September, 2026 | 10:21 AM

బిల్డర్ సాజిద్ అరెస్ట్.. గచ్చిబౌలిలో కొనసాగుతున్న రెస్క్యూ

23-08-2026 | 01:30pm

హైదరాబాద్ఆగస్టు23(విజయక్రాంతి): గచ్చిబౌలిలో భవనం కూలిన ఘటనలో(Gachibowli building collapse) రెస్క్యూ కొనసాగుతుంది. నిన్న ఏడంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి చెందారు. 40 గజాల్లో ఏడంతస్తుల భవనం నిర్మించిన సాజిద్.. శిథిలాలుపడి పక్కన ఉన్న జయదర్శి అపార్ట్ మెంట్ కూడా ప్రమాదధాటికి ధ్వంసం అయింది. ఈరోజు జయదర్శి అపార్ట్ మెంట్ కూల్చివేసే అవకాశం ఉంది. అంజయ్యనగర్ లో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. రెండు రోజుల్లో అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇవ్వనున్నారు. 

ఇప్పటికే 10 అక్రమ నిర్మాణాలు గుర్తించారు అధికారులు. ప్రమాదంపై రాయదుర్గ్ పోలీసులు ఏఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్రమంగా ఏడంతస్తుల భవనం నిర్మించిన బిల్డర్ సాజిద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 105 BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అలాగే టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ ని కూడా అధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.  ఈ సమయంలో సంతోష్ కు హైదరాబాద్ వదిలి ఎక్కడికి వెళ్లొద్దని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు