మంథనిలో ఎస్‌ఐఆర్ ఫేజ్–2పై బీఎల్‌ఏలకు సమగ్ర అవగాహన
స్క్రీన్ ప్రదర్శన ద్వారా వివరించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు
మంథని,ఆగస్టు 23(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథనిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) క్యాంపు కార్యాలయంలో ఆదివారం పాలకుర్తి, కమాన్‌పూర్, రామగిరి, ముత్తారం, మంథని మండలాలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్‌ఏ) ఎస్‌ఐఆర్ – ఫేజ్–2 ప్రక్రియపై టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా స్క్రీన్ ప్రదర్శన ద్వారా ఎస్‌ఐఆర్ ఫేజ్–2లో చేపట్టాల్సిన విధివిధానాలు, బూత్ స్థాయిలో బీఎల్‌ఏల బాధ్యతలు, ఓటర్ల వివరాల పరిశీలన, ఓటరు జాబితాలో ఉన్న తప్పులు లేదా అవసరమైన మార్పులను గుర్తించడం వంటి కీలక అంశాలను వివరించారు. ప్రతి బూత్‌లో ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా బాధ్యతతో పనిచేయాలని బీఎల్‌ఏలకు శ్రీను బాబు సూచించారు. ఎస్‌ఐఆర్ ఫేజ్–2 ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు






