17 April, 2026 | 9:03 PM

మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్

30-05-2025 02:00 PM

హైదరాబాద్: మలక్ పేట్ రైల్వే బ్రిడ్జ్(Malakpet railway bridge) సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చాదర్ ఘాట్-మలక్ పేట్ మార్గం(Chaderghat-Malakpet route)లో రహదారిపై భారీగా మురుగు నీరు చేరింది. 4 రోజుల క్రితమే గొయ్యి పడినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. మురుగు నీటితో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. చాదర్ ఘాట్ చుట్టుపక్కల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు నీటితో ట్రాఫిక్ కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి రావడంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నారు. వర్షాల కారణంగా డ్రైనేజీలు, రోడ్డు పక్కన ఉన్న కాలువలు పొంగుతున్నాయి. ఈ క్రమంలోనే వాహనదారులకు ఇబ్బంది కలుగుతోంది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని సమస్యను పరిస్కరించాలని స్థానికులు కోరుతున్నారు.