9 April, 2026 | 5:06 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

నూతన ఎంఈఓగా హెలెన్ డారితి

26-09-2024 06:45 PM

నూతన ఎంఈఓగా హెలెన్ డారితి

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మండల నూతన విద్యాధికారిగా హెలెన్ డారతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ప్రధానోపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది పుష్పగుచ్చం అందించి స్వాగతం తెలిపారు. అనంతరం ప్రధానోపాధ్యాయులతో పలు విద్యా అభివృద్ధి విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంఇఓ హెలెన్ డారతి మాట్లాడుతూ... మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యతతో విద్యా బోధన జరిగేలా, చర్యలు తీసుకుంటానని అన్నారు. అదేవిధంగా మండలంలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తానని, విద్యార్థులలో పోషకాహార లోపాన్ని తగ్గించి, నాణ్యమైన ఆహారాన్ని వారికి అందేలా ప్రభుత్వం చేపడుతున్న మిడ్ డే మీల్స్ ను మెనూ ప్రకారం సక్రమంగా అందేలా చూస్తానని తెలిపారు.