16 April, 2026 | 10:20 AM

ఘనంగా హెలెన్ కిల్లర్ 145వ జయంతి

28-06-2025 12:48 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (విజయక్రాంతి): హెలెన్ కిల్లర్స్ విద్యాసంస్థల చైర్మన్ పఠాన్ ఉమర్‌ఖాన్ ఆధ్వర్యంలో శుక్రవారం బ్యాంక్ కాలనీలోని హెలెన్ కిల్లర్స్ పాఠశాలలో హెలెన్ కిల్లర్ 145వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్, కాలేజ్ విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

హెలెన్ కిల్లర్  అంధ, చెవిటి, మూగ సమస్యలతో పుట్టి, పట్టుదలతో జీవితంలో ముందుకుసాగి సాధించలేనిది ఏదీలేదని తన జీవితం ద్వారా నిరూపించి, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని పఠాన్ ఉమర్ ఖాన్ తెలిపారు.

అనంతరం స్కూల్ వైస్ ప్రెసిడెంట్ మాకం పార్థసారథి దశదినకర్మను పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నివాళి అర్పించి, మౌనం పాటించారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులకు స్వీట్లు, అరటి పండ్లు పంచిపెట్టారు.