రేవంత్‌కు గుణపాఠం తప్పదు
గజ్వేల్ మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్
గజ్వేల్, జూలై 19: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే ప్రజల నుంచి గుణపాఠం తప్పదని గజ్వేల్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రతి వేదికపై కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడమే ముఖ్యమంత్రి పనిగా మారిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పోషించిన పాత్రను ప్రజలు ఎన్నటికీ మరచిపోరని, ఆయనను తెలంగాణ ప్రజల హృదయాల నుంచి ఎవరూ చెరపలేరని అన్నారు.
ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందనే విమర్శల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు, నేతన్నలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కరవు పరిస్థితులు, శాంతిభద్రతల అంశాలపై దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతం చేసి రాష్ట్ర సాధనలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని, అలాంటి నాయకుడిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పు ఇస్తారని, కేసీఆర్కు మద్దతుగా తెలంగాణ ప్రజలు నిలుస్తారని మాదాసు శ్రీనివాస్ అన్నారు. అలాగే కేసీఆ్ప అనుచిత వ్యాఖ్యలు కొనసాగితే తెలంగాణవాదులు ప్రజాస్వామ్యబద్ధంగా స్పందిస్తారని హెచ్చరించారు.






