calender_icon.png 11 February, 2026 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీహెచ్‌సీలో వైద్య సిబ్బందికి హెపటైటిస్- వ్యాక్సిన్

11-02-2026 12:00:00 AM

గుండాల, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి):మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సిబ్బందికి మంగళవారం హెపటైటిస్-బి వ్యాక్సినేషన్ చేశారు. వైద్య సిబ్బంది అందరూ విధిగా హెపటైటిస్-బి వ్యాక్సిన్ వేయించుకోవాలని పీహెచ్సీ వైద్యాధికారి సుధీప్ విజ్ఞప్తి చేశారు.

పీహెచ్సీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది నిరంతరం రోగులకు వైద్య సేవలు అందిస్తారని, దీనివల్ల హెపటైటిస్-బి అనే కాలేయ సంబంధిత వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందని, అందుకే ప్రతీ ఒక్క వైద్య సిబ్బంది ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజు, సత్యం, ఎల్టీ రమేష్, ఏఎన్‌ఎంలు, ఎం ఎల్ హెచ్ పీ లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.