ఇదిగో క్రిస్మస్ గిఫ్ట్!
క్రిస్మస్ పండుగ వస్తుందంటే చాలు.. వారం రోజులనుంచే పిల్లల్లో కొత్త ఉత్సాహం మొదలవుతుంది. శాంటా క్లాజ్, చాక్లెట్స్, గిఫ్టులు ఇవన్నీ పిల్లల్లో మరింత ఆనందాలు నింపుతాయి. అందుకే క్రిస్మస్ రోజు బహుమతుల కోసం ఇష్టంగా ఎదురుచూస్తుంటారు. ఈ పండుగకు మీ బుజ్జాయిలకు అదిరిపొయే బహుమతులు ఇవ్వాలనుకుంటున్నారా.. వీటిపై ఓ లుక్కేయండి మరి. పిల్లల నుంచి పెద్దల వరకు క్రిస్మస్ తాత అంటే ఇష్టపడనివాళ్ళు ఎవరూ ఉండరు.
తెలుపు, ఎరుపు రంగులతో స్మూత్‌గా ఉండే శాంటా క్లాజ్ డ్రెస్ అంటే అందరికీ బహు మతి ఇవ్వాలనుకున్న వారికి పిల్లలు ఉన్నట్లయితే శాంటా క్లాజ్ డ్రెస్ గిఫ్ట్‌గా ఇవ్వండి. వాటిని చూడగానే పిల్లలు చాలా సంబరపడిపోతారు. అవి వేసుకుంటే పిల్లలు చాలా క్యూట్‌గా కనిపిస్తారు. మెత్తగా ఉండటం వల్ల చర్మానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ప్రపంచవ్యాప్తంగా పిల్లలు అందుకున్న గిఫ్టులో శాంటా క్లాజ్ డ్రస్సు కచ్చితంగా ఉంటుందట. మీరు కూ డా మీ పిల్లలను శాంటాలాగా తయారుచేయండి ఈ పండక్కి.
క్రిస్మస్ చెట్టు
క్రిస్మస్‌ను చాలామంది జరుపుకుంటారు. అయితే ప్రతిఒక్కరి ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఉంటుంది. పెద్ద పెద్ద మాల్స్‌తో సహా అనేక బహిరంగ ప్రదేశాల లో కూడా క్రిస్మస్ చెట్లు డిసెంబర్ నెలంతా కనిపిస్తుంటాయి. బాల్స్, రకరకాల వస్తువులతో లైటింగ్‌తో అందంగా డెకరేట్ అయ్యే క్రిస్మస్ ట్రీ ఎంతోమందిని ఆకట్టుకుంటుంది. పిల్లలకు బహుమతి ఇవ్వాల నుకుంటే క్రిస్మస్ చెట్టుని ఇవ్వచ్చు. దీన్ని ఇంటికి తీసుకురావడం వల్ల అదృష్టం వస్తుంది అని నమ్ముతారు కూడా. అంతేకాదు బంధువులు, స్నేహితులు ఇంటి కి వస్తే వారిని మరింత ఆహ్లాదపరుస్తుంది కూడా.
సువాసన క్యాండిల్స్
ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల క్యాండిల్స్ ఉన్నాయి. అందులో సువాసన వచ్చే క్యాం డిల్స్ గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు. అవి వెలి గించి నప్పుడు ఇల్లంతా అద్భుతమైన సువా సన వస్తుంది. మనసు కూడా రిలాక్స్‌గా ఉంటుంది. లావెండర్, గులాబీ వంటి అనేక సువాసన కలిగిన క్యాండిల్స్‌ను బహుమతులుగా ఇస్తే బాగుంటుంది. ఇవి ఒత్తిడిని దూరం చేస్తాయి. పిల్లల కు క్యాండిల్స్ ఇవ్వడం మధుర జ్ఞాపకంగా నిలిచిపోతోంది.
కళను గుర్తించేలా
చాలామంది పిల్లలు డ్రాయింగ్, పెయింటింగ్ ఇష్టపడతారు. రంగురంగుల పెన్సిల్స్, వాటర్ కలర్స్, డ్రాయింగ్ బుక్స్ బహుమతిగా ఇవ్వవచ్చు. ఇది వారి కళను మెరుగుపరుస్తుంది. చిన్నప్పుడే పెయింటింగ్ అలవాటు చేయడం వల్ల అదొక వ్యాపకంగా మారి అద్భుతమైన పెయింటిగ్స్ వేయగలుగుతారు.
పుస్తకాలు
మానసిక వికాసానికి పుస్తకాలు ఎంతోగానో ఉపయోగపడుతాయి. కాబట్టి పుస్తకాలు పిల్లలకు గొప్ప బహు మతి. పిల్లల కోసం బొమ్మల పుస్తకాలు, పెద్ద పిల్లలకు కథల పుస్తకాలు ఇవ్వొచ్చు. వాటి నుంచి కొత్త విషయాన్ని నేర్చుకుంటారు. అంతేకాకుండా పిల్లల్లో సృజన కూడా పెరుగుతుంది. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది.
రంగురంగుల స్వెటర్స్
వింటర్ సీజన్‌లో క్రిస్మస్ వస్తుంది కాబట్టి వాళ్ళకి స్వెటర్ గిఫ్టుగా ఇస్తే చాలా బాగుంటుంది. వీటిని ధరించిన ప్రతిసారి మిమ్మల్ని గుర్తుచేసుకుంటారు. స్వెటర్ వేసుకుని వారికోసం హుడీలు కూడా తీసుకోవచ్చు. చలికాలంలో స్వెటర్లు ఎంతో సౌకర్యవంతంగా ఉండటంతోపాటు వెచ్చగా ఉంచుతాయి. వీటిని ఎవరికైనా గిఫ్ట్‌గా ఇస్తే వాళ్ళు వద్దనకుండా తీసుకుంటారు. ఇవి వేసుకున్న ప్రతిసారి మీపట్ల చూపించే ప్రేమ గుర్తుకు వస్తుంది.
-సూపర్‌హీరో బొమ్మలు
పిల్లలు కొన్ని కామిక్ పాత్రలను ఇష్టపడతారు. సూపర్‌హీరో, ప్రిన్సెస్.. ఇలా ఏదైనా యానిమేషన్ పాత్రల బొమ్మ లతో ఉన్న దుస్తులు కొనుగోలు చెయ్యండి. లేదా ఆ బొమ్మలు కలిగిన బెడ్ షీట్స్ అయినా బాగుంటాయి.
లాఫింగ్ బుద్ధ
లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి అదృష్టం వస్తుందని నమ్ముతారు. సాధారణంగా లాఫింగ్ బుద్ధను కొనకూడదు. కానీ బహుమతిగా ఇవ్వాలి. క్రిస్మస్ సందర్భంగా పిల్లలకే కాదు పెద్దలకూ లాఫింగ్ బుద్ధను బహు మతిగా ఇవ్వడం బెస్ట్ ఛాయిస్. లాఫింగ్ బుద్ధ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. శాంటా తాతా భలే భలే!
క్రిస్మస్ అనగానే అందరికీ శాంటా క్లాజ్ గుర్తుకువస్తాడు. ఎర్ర బట్టలూ, తెల్ల గడ్డంతో, ప్రశాంతమైన ముఖ కవళికలు, భుజాన బహుమతుల మూటతో ఉండే వ్యక్తి గుర్తుకువస్తాడు. చిన్న పిల్లలతో పాటూ పెద్దవాళ్ళు కూడా శాంటా అంటే ఎంతో ఇష్ట పడతారు. అసలు ఈ శాంట ఎవరో తెలుసా..
క్రీస్తు శకం 280లో సెయింట్ నికోలస్ అనే ఒక మాంక్ ఉండేవారు. ఆయన ప్రస్తుతం టర్కీ గా పిలిచే మైరా అనే ప్రదేశంలో జన్మించారని చెబుతారు. ఈయన తన డబ్బును పేదలకు, రోగులకు సాయం చేస్తుండేవాడు. ఒకసారి ఒక తండ్రి తన ముగ్గురి కూతుళ్ళనీ పెళ్ళి చేయడానికి డబ్బులేక అమ్మేస్తుంటే సెయింట్ నికోలస్ అడ్డుపడ్డాడనీ, వారి వివాహానికి కావాల్సిన ధన సహాయం చేశాడనీ చెబుతారు.
నెమ్మదిగా సెయింట్ నికొలేస్ చిన్న పిల్లలకీ ఫేవరెట్ గా మారిపోయారు. అయితే సెయింట్ నికోలస్, సింట్ నికోలస్, సింటర్ క్లాస్, శాంటా క్లాజ్ అంతా ఒకరే కానీ శాంటా క్లాస్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా బాగా తెలిసిన పేరు. పందొమ్మిదవ శతాబ్దం మొదటి నుంచి క్రిస్మస్ సమయం లో పిల్లలకి బహుమతులివ్వడం ఆచారంగా మారింది. షాపింగ్ మాల్స్, స్టోర్స్ లో శాంటా క్లాస్ లాగా డ్రెస్ చేసుకున్న వారిని ఉంచి పిల్లలనీ, తల్లిదండ్రులనీ ఎట్రాక్ట్ చేయడం మొదలైంది.






