13 May, 2026 | 11:29 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

ముద్దుల సీన్లు వద్దంటూ..

22-02-2025 12:00 AM

కొన్ని పాలసీలను పెట్టుకుని సినిమాల్లో రాణించడమంటే అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అలా పాలసీలతో రాణించే నటీ నటులు వేళ్ల మీద లెక్కపెట్టగలిగినంత మందే ఉంటారు. ఒక స్టార్ డమ్ వచ్చాక పాలసీ పెట్టుకోవడం వేరు.. పాలసీ పెట్టుకుని మరీ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడం.. రాణించడం వేరు.  మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఈ కోవలోకే వస్తారు. ‘మార్కో’తో విజయం సాధించిన ఆయన ఓ నియమం పెట్టుకొని, తూ.చ తప్పకుండా పాటిస్తున్నాడు. “సినిమాల్లోకి అడుగు పెట్టిన సమయంలోనే.. ముద్దు ఇంటిమేట్ సీన్స్‌కు దూరంగా ఉండాలనే పాలసీ పెట్టుకున్నా.

నా సినిమాలు కుటుంబ సమేతంగా చూసేలా ఉండాలి. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నా. ముద్దు, ఇంటెన్స్ సీన్స్‌లో నటించాలని కొందరు దర్శక నిర్మాతలు నాపై ఒత్తిడి తేవడంతోపాటు వేరే హీరోల సినిమాలను ఉదాహరణగా చూపించి అలా చేయాలని అడిగారు. నా తోటి హీరోలు అలాంటి సన్నివేశాల్లో నటిస్తే తప్పుబట్టను. కానీ రొమాన్స్ చూపించేందుకు ముద్దులు పెట్టుకోవడం ఒక్కటే మార్గం కాదనేది నా భావన. ఇది నాకు నేనుగా పెట్టుకున్న పాలసీ” అని తెలిపారు.