14 August, 2026 | 2:38 PM

నేను కూడా సైబర్ బాధితుడినే: హీరో నాగార్జున

14-08-2026 01:35 PM

హైదరాబాద్: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సైబర్ సెక్కూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో 'సురక్షా కా తిరంగా సైబర్ అవేర్‌నెస్'(Suraksha Ka Tiranga Cyber ​​Awareness) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ అక్కినేని నటుడు(Nagarjuna Akkineni) నాగార్జున పాల్గొన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యమని, 1980 నుంచే ఈమెయిల్ వాడుతున్నట్లు నాగార్జున పేర్కొన్నారు.

ఈమెయిల్ జాగ్రత్తగా వాడాలని అప్పట్లోనే సూచించారని గుర్తుచేశారు. 15 రోజులకు పాస్ వర్డ్ లు మారుస్తుంటానని తెలిపారు. తన మొబైల్లో కనీసం ఫొటోలు కూడా తీయనన్న నాగ్ తన ఇంట్లోనూ సైబర్ బాధితులు ఉన్నారని వివరించారు. 'నేనూ సైబర్‌ క్రైమ్‌ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం నేను సైబర్‌ ఫ్రాడ్‌కి గురయ్యా.. బ్యాంకు అధికారి పేరుతో నాకు కాల్‌ వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఇబ్బంది పెట్టారు.' అని అక్కినేని నాగార్జున స్పష్టం చేశారు. పైరసీ పై తెలంగాణ పోలీసులు యుద్ధం చేశారని, పైరసీని అరికట్టడం కోసం సీవీ ఆనంద్, సజ్జనార్ ఎంతగానో కృషి చేశారని  కొనియాడారుఫిల్మ్ పైరసీని అరికట్టడంలో తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ స్థానంలో ఉంటారని తెలిపారు.