7 May, 2026 | 1:20 AM

కర్ణాటక సీఎంను కలిసిన హీరో రామ్‌చరణ్

01-09-2025 12:00 AM

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోని ఒక సాంగ్ షూటింగ్ ప్రస్తుతం మైసూర్‌లో జరుగుతుంది. ఈ సందర్భంగా ఆదివా రం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రామ్ చరణ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. సిద్ధరామయ్య ఆహ్వానం మేరకు రామ్‌చరణ్ మర్యాద పూర్వకంగా కలుసుకుని శాలువాతో సత్కరించారు.

ఈ క్రమం లో  సిద్దరామయ్య రామ్‌చరణ్‌ను ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా ‘పెద్ది’ సినిమా గురించి కొన్ని విశేషాలను రామ్‌చరణ్ సిద్ధరామయ్యకు తెలిపారు. అలాగే సినీ అంశాలు కూడా కొన్ని వీరి మధ్య చర్చకు వచ్చాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఒక భారీ సాంగ్ షూటింగ్ ప్రస్తుతం మైసూర్‌లో శరవేగంగా జరుగుతోంది.

సుమారు 1000 మందికిపైగా డాన్సర్లతో ఈ సాంగ్ షూట్ చేస్తున్నారు మేకర్స్. ‘పెద్ది’ సినిమాను బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తుండగా వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సమర్పిస్తున్నాయి.