7 May, 2026 | 2:08 AM

ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

01-09-2025 12:00 AM

స్టార్ హీరో నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శ కత్వంలో ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్‌పై  నిర్మా త సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. ఈ మూవీ టీమ్ హాలీవుడ్‌లోని #ConnekktMobScene ఎగ్జి క్యూటివ్ వి.పిఆఫ్ క్రియేటివ్ కంటెంట్ అలె గ్జాండ్రా ఈ.

విస్కోంటిని కలిసి సినిమా కోసం కొలాబరేషన్ డిస్కస్ చేస్తున్నారు. ఈ డెవలప్ మెంట్ వాళ్ల ఇంటర్నేషనల్ ప్లాన్స్ మరింత స్ట్రాం గ్‌గా ప్రజెంట్ చేస్తోంది. మొదటినుంచే ఈ ప్రాజె క్ట్‌కు రీజనల్ సినిమాలాగా కాకుండా, పాన్-వరల్డ్ మూవీలా ట్రీట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ వెర్షన్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ఇండియాలో భారీ సంఖ్యలో పాలోవర్స్‌ని కలిగి ఉన్న ప్రఖ్యాత హాలీవుడ్ నటుడిని తీసుకురావడానికి టీమ్ చర్చలు జరుపుతోంది.

ఇది ప్రాజెక్ట్‌కి ఇంకో గ్లోబల్ డైమెన్షన్ జోడిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జూయాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. సినిమాటోగ్రఫీకి సి.హెచ్.సాయి, మ్యూజిక్ అనిరుధ్ రవిచందర్, ఎడిటింగ్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లా పని చేస్తున్నారు. ఈ సినిమా 2026 మార్చి 26న థియేటర్లలోకి రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్.. మొత్తం ఎనిమిది భాషల్లో విడుదల కానుంది.