19 May, 2026 | 3:04 PM

హీరో రవితేజకు షూటింగ్ లో తీవ్ర గాయాలు..

24-08-2024 05:55 PM

హైదరాబాద్: భాను దర్శకత్వంలో హైదరాబాద్ శివారు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫైట్ సీన్ చేస్తుండగా శనివారం ప్రమాదం జరిగింది. ఫైట్ సీన్ లో సినీ హీరో రవితేజ కుడిచేతికి తీవ్ర గాయం అయ్యింది. హీరో రవితేజ కుడి చేతి నరాలు చిట్లడంతో యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరుగుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నోటినిండా ఆక్సిజన్ ట్యూబులు, గుండెల మీద ఈసీజీ వైర్లు, కుడిచేతికి రక్తంతో ఆసుపత్రి బెడ్ మీద రవితేజను చూసిన అభిమానులు ఆందోళనకు  గురవుతున్నారు.