జిట్టా బాలకృష్ణా రెడ్డిని యశోద హాస్పిటల్‌లో పరామర్శించిన కేటీఆర్
24-08-2024 05:49 PM
హైదరాబాద్: అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న వైద్యం వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అదే విధంగా జిట్టా బాలకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులతోనూ కేటీఆర్ మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, జిట్టా కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పినట్లు వారికి సూచించారు.






